Thursday, June 08, 2006

తెలివి

----- పట్టాభిరామ్ గారు రాసిన పుస్తకంలో చదివిన గుర్తు -----
మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళినది రష్యన్లని అందరికీ తెలిసినదే. ఆ తర్వాత అమెరికన్లు ఆ ఘనత సాధించారు. అయితే అమెరికన్లు అంతరిక్షంలోకి వెళ్ళే ముందు వాళ్ళకు ఒకటి అర్ధం కాలేదు. గురుత్వాకర్షణ లేనిచోట పెన్ను పనిచేయదు కనుక అక్కడ రాయడానికి ఏమి ఉపయోగించాలో; అసలు రష్యన్లు ఏ ఇంకు ఉన్న పెన్నుని ఉపయోగించి ఉంటారా అని తెగ ఆలోచించారంట! ఇంతకీ అంతరిక్షంలో రాయడానికి రష్యన్లు ఉపయోగించినదేంటో తెలుసా? పెన్ను కాదు పెన్సిల్!!!

Thursday, June 01, 2006

జీవన సౌందర్యం

ఆర్థుర్ అషే (Arthur Ashe) గొప్ప వింబుల్డన్ ఆటగాడు. అతడు క్యాన్సర్ తో బాద పడుతున్నాడు. ప్రపంచం నలుదిక్కుల నుండి అతని అభిమానుల నుండి అతనికి ఉత్తరాలు అందుతున్నాయి. ఒక అభిమాని ఈ విధంగా వ్రాసాడు.

" ఆ భగవంతుడు మీమ్మల్నే ఎందుకు ఇలా వ్యాధిగ్రస్తుడిని చెయ్యాలి. "

దానికి ఆర్థుర్ గారు ఈ విధంగా బదులిచ్చారు.

" ఈ ప్రపంచం మొత్తంలో బహుశా 5 కోట్ల మంది టెన్నస్ ఆడటం మొదలుపెట్టారు; వారిలో 50 లక్షల మంది దానిని నేర్చుకోగలిగారు; వారిలో 5 లక్షల మంది దానినే జీవనోపాధిగా ఎంచుకున్నారు; వారిలో 50 వేల మంది బరిలోకి వెళ్ళగలుగుతున్నారు; వారిలో 5 వేల మంది వింబుల్డన్లో ఆడగలిగారు; వారిలో నలుగురు సెమీ ఫైనల్స్ కి .... ఇద్దరు ఫైనల్స్ కి... చివరికి ఫైనల్ లో నేను గెలిచిన సంతోష సమయంలో నన్నే ఎందుకు విజేతగా చేసావు అని ఆ భగవంతుడిని నేను అడగలేదు. అందుకే ఇప్పుడు ఈ భాదలో నేను అడగలేను "

- ఈ స్వేచ్ఛానువాదంలో లోపాలు ఉంటే మన్నించగలరు.

మొదటి మాట

ఏదైనా మెయిల్ గానీ పుస్తకం గానీ చదువుతున్నప్పుడో లేక ఏ వార్తలో చదువుతున్నప్పుడో మనసుకు హత్తుకునే విషయాన్ని (కధ కావచ్చు, కల్పితం కావచ్చు లేదా వార్త కావచ్చు) ఇక్కడ ప్రచురిద్దామని ...